ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సు

భారతదేశానికి న్యాయవ్యవస్థే సుప్రీం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో చట్టమే అత్యున్నతమై నదని తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయసదస్సు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల న్యాయమూర్తులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 24 దేశాల నుంచి న్యాయనిపుణులు పాల్గొన్నారు. సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ, దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని గుర్తు చేశారు. దేశంలో శాసన, న్యాయశాఖలు పరస్పరం గౌరవించుకుంటాయన్న మోదీ, వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్ట ప్రకారంగా ఉండాలన్నారు.
విధులను సక్రమంగా నిర్వర్తిస్తే హక్కులను అమలు చేయడం ఈజీ అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను మనం నిర్లక్ష్యం చేస్తు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లను న్యాయవ్యవస్థ ఎంత సమర్థంగా ఎదుర్కొంటే, చట్టాల అమలులో విజయం అంతగా ఉంటుందన్నారు. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం నిలయమన్న చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com