నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల చివరి లేఖ

నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల చివరి లేఖ

నిర్భయ కేసు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నట్లే కనిపిస్తోంది. దోషులకు ఈసారి కచ్చితంగా ఉరి అమలు చేస్తారని అంటున్నారు. తాజాగా తీహార్ జైలు అధికారులు నలుగురు దోషులకు చివరి లేఖ రాశారు. ఆఖరిసారి కుటుంబసభ్యులను కలవడానికి పవన్‌ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ సింగ్‌లకు అవకాశం ఇస్తానమి అధికారులు పేర్కొ న్నారు. ఇందుకు ఇద్దరు దోషులు అంగీకరించారు. మరో ఇద్దరు దోషులు ఇష్టపడలేదు. కుటుంబసభ్యులను కలుస్తా మని అక్షయ్‌, వినయ్‌ జైలు అధికారులకు చెప్పారు. రెండో డెత్‌ వారెంట్‌కు ముందే కుటుంబసభ్యులను కలిశామని ముకేష్, పవన్ తెలిపారు. సాధారణంగా ములాఖత్‌లో దోషులు తమ కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే కిటికీ ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. ఐతే,ఉరిశిక్షకు ముందు చివరిసారి కలిసే ములాఖత్‌లో దోషులు కుటుంబ సభ్యులను నేరుగా కలిసి మాట్లాడడానికి అనుమతించనున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేశారు. మార్చ్ 3వ తేదీన నలుగురు దోషులను ఉరి తీయాలని పటియాల కోర్టు ఆదేశించింది. మరణ శిక్ష ఆదేశాలను పున:సమీక్షించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు. ఐతే, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ కాగా, దోషులు చట్టంలోని లోపాలను ఉపయోగించుకొని శిక్షను కొన్ని రోజులు వాయిదా వేయించారు. మూడోసారి మాత్రం ఆ అవకాశం ఉండబోదని అంటున్నారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి తలారీని 2 రోజుల ముందే పంపించాలని తిహార్ జైలు అధికారులు యూపీ జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారు.

Tags

Read MoreRead Less
Next Story