ఈసారైనా నిర్భయ నిందితులకు ఉరి అమలవుతుందా?
లా లొసుగులను అదునుగా చేసుకొని ఉరి శిక్ష అమలును ఆపుతూ వస్తున్నారు నిర్భయ దోషులు. దీంతో ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలని తొలుత అధికారులను కోర్టు సూచించింది. కానీ, న్యాయపరమైన కారణాలతో శిక్ష అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 3వ తేదికి ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు 17న మూడోసారి డెత్ వారెంట్ జారీ చేసింది కోర్టు. శిక్ష అమలులో జాప్యం నిర్భయ తల్లిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
అయితే..ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విషయంలో అడ్డంకులు తొలిగిపోతున్నాయి. తన మానసిక స్థితి సరిగా లేదని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను పాటియాల హౌస్ కోర్టు కొట్టివేసింది.
దీంతో దోషులు నలుగురికి తప్పించుకునే దారులు దాదాపుగా ముగిసిపోయాయి. మార్చి మూడో తేదీన దోషులను ఉరి తీస్తారని నమ్ముతున్నట్టు నిర్భయ తల్లి అన్నారు.
మూడో సారి డెత్ వారెంట్ జారీ అయిన తర్వాత నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దోషులకు ఈసారి కచ్చితంగా ఉరి అమలు చేస్తారని అంటున్న తీహార్ జైలు అధికారులు... నలుగురు దోషులకు చివరి లేఖ రాశారు. ఆఖరిసారి కుటుంబసభ్యులను కలవడానికి పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ సింగ్‌లకు అవకాశం ఇస్తానమి అధికారులు తెలిపారు. చివరి కోరికగా కుటుంబసభ్యుల్ని కలుసుకునేందుకు మని అక్షయ్, వినయ్ జైలు అంగీకరించారు. మరో ఇద్దరు దోషులు ఇష్టపడలేదు. రెండో డెత్ వారెంట్‌కు ముందే కుటుంబసభ్యులను కలిశామని ముకేష్, పవన్ తెలిపారు.
సాధారణంగా ములాఖత్‌లో దోషులు తమ కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే కిటికీ ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. ఐతే,ఉరిశిక్షకు ముందు చివరిసారి కలిసే ములాఖత్‌లో దోషులు కుటుంబ సభ్యులను నేరుగా కలిసి మాట్లాడడానికి అనుమతించనున్నారు. లుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి తలారీని 2 రోజుల ముందే పంపించాలని తిహార్ జైలు అధికారులు యూపీ జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com