బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు..

కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యా రాణి ఆదివారం బీజేపీలో చేరారు. ఆమె దాదాపు 2 వేల మంది మద్దతుదారుల కలిసి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతూ..
'నా తండ్రి కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు, అయితే అతను ఎంచుకున్న మార్గం తప్పు అని.. ఆ విషయంలో తనకుగానీ, తన ఫ్యామిలీకిగానీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ.. ఆయన ఆ పని ఎందుకు చేశారన్నదే ముఖ్యమైన అంశం. నా తండ్రి చివరిశ్వాస వరకూ పేదల కోసమే బతికిన వ్యక్తి.. ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయంటే.. వీరప్పన్ ఎలాంటివారో అర్థంచేసుకోవచ్చు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాను అని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com