వెలగపూడి నుంచి హైకోర్టుకు వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డులో రైతుల మానవహారం

ప్రతిరోజు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్న రైతులు సోమవారం సీడ్ యాక్సిస్ రోడ్డు బాట పట్టారు. వెలగపూడి నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో వారంతా భారీ మానవహారంగా ఏర్పడి తమ ఆకాంక్షను తెలియచేయనున్నారు. న్యాయమూర్తులు హైకోర్టుకు వెళ్లే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేయడం ద్వారా.. ఉద్యమాన్ని న్యాయ వ్యవస్థ దృష్టికి మరోమారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ ఓసారి ఇలాగే మానవహారం చేపట్టారు. ఈసారి కూడా ఆ తరహాలోనే న్యాయమూర్తులకు విన్నపాలు చేసుకుంటున్నారు. రైతులు, మహిళలు అంతా కూడా రైతు జెండాలు చేత పట్టి జై అమరావతి అని నినాదాలు చేస్తున్నారు. వేలాదిమంది రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి అక్కడా ఉద్రిక్తతకు తావు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ తమ ఉద్యమ ఆకాంక్షను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం రైతులంతా సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి వచ్చారు. మందడం నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా నేలపాడులో హైకోర్టు ఉన్న ప్రాంతం వరకూ భారీగా మానవహారంగా నిలుచున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com