ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత ఆలోచనలు ఎక్కడినుంచి వస్తున్నాయి : చంద్రబాబు

X
వైసీపీ సర్కారు తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పేదలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే.. ప్రభుత్వం నుంచి చేయాలని, అంతేకానీ.. ఒక పేదకు మంచి చేసేందుకు ఇంకో పేదకు జీవనాధారం లేకుండా చేయడం ఏంటని ప్రశ్నించారాయన. మీ ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచి ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న భూములను లాక్కుని వాళ్లకు అన్యాయం చేస్తారా అంటూ ట్వీట్ చేశారు.
ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు మీకు ఎక్కడినుంచి వస్తున్నాయంటూ ప్రశ్నించారు చంద్రబాబు. పేదల పట్ల చిత్తశుద్ది ఉంటే.. ముందు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలను పేదలకు పంచాలన్నారు. సగంలో ఆగిపోయిన గృహనిర్మాణాలను పూర్తి చేయాలంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
