మిడి డ్రెస్‌లో ఇవాంకా.. ధర చూస్తే..

మిడి డ్రెస్‌లో ఇవాంకా.. ధర చూస్తే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్‌, కూతురు ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జరెడ్‌ కుష్‌నర్‌లు కూడా భారత్ కు విచ్చేశారు.. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్‌ డ్రెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్‌ నెక్‌లైన్‌తో, పఫ్పుడ్‌ స్లీవ్స్‌తో డ్రెస్‌ చాలా అందంగా ఉంది. దానికి తోడు ఆమె డ్రెస్ కు మ్యాచ్‌ అయ్యేలా ఎర్రటి హైహీల్స్‌ కూడా ధరించారు. ఈ దుస్తుల ధర రూ .1,71,331 (USD 2,385). అయితే ఈ దుస్తులలో ఇవాంకా కనిపించడం ఇదే తొలిసాయిర్ కాదు. 2019 సంవత్సరంలో ఆమె అర్జెంటీనాలో పర్యటించినప్పుడు కూడా ఆమె ఇదే డ్రెస్ ను ధరించారు.

Tags

Read MoreRead Less
Next Story