24 Feb 2020 10:58 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / పోలీసుల అదుపులో...

పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌డాన్‌ రవి పూజారి

పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌డాన్‌ రవి పూజారి
X

మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌డాన్‌ రవి పూజారిని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌతాఫ్రికాలో అరెస్ట్‌ చేసిన పోలీసులు రాత్రి బెంగుళూరు తీసుకువచ్చారు. 200కి పైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా రవి పూజారి విచారిస్తున్నారు. మర్డర్లు, దోపిడిలతో పాటు బాలీవుడ్‌ బిగ్‌ షాట్స్‌ ను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు రవి పూజారపై ఆరోపణలు ఉన్నాయి.

చోటారాజన్ దగ్గర శిష్యరికం చేసి... దావూద్ ఇబ్రహీం దగ్గర డాన్ ఎలా చలామణి కావాలో ఎలా బెదిరించాలో ఒంటబట్టించుకున్నాడు. తర్వాత తానే సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అండర్ వరల్డ్ డాన్ అయ్యాడు. మర్డర్ లు, సెటిల్మెంట్లు, దోపిడిలు, బెదిరింపులకు పాల్పడుతూ డాన్ గా అవతరించాడు. బాలీవుడ్ లో అతని పేరు చెబితేనే వణికిపోయేంతగా ఎదిగిపోయాడు.

20 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కర్నాటకలో అతనిపై కుప్పులుతెప్పులుగా కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డాన్ ఎట్టకేలకు పట్టుడ్డాడు. సౌతాఫ్రికా, సెనెగల్, ఇండియన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పూజారి రవిని అరెస్ట్ చేశారు. విచారణలో మరికొందరు బడాబాబుల చీకటి బండారం బయటకొస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

Next Story