పట్టణ ప్రగతి సన్నద్ధతపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

పట్టణ ప్రగతి సన్నద్ధతపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం తీసుకొచ్చేలా చేపట్టిన పల్లె ప్రగతి విజయవంతం అయినట్లు చెబుతున్న ప్రభుత్వం..ఇప్పుడు పట్టణాలపై ఫోకస్ చేస్తోంది. ఫ్రిబవరి24 నుంచి మార్చి 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పట్టణాలకు పచ్చతోరణం వేయటం లక్ష్యంగా పనులు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నద్ధతపై మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు.

పట్టణ ప్రగతి ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతామని అన్నారు మంత్రి కేటీఆర్. పట్టణాల రూపురేఖలు మార్చి, ప్రతి వార్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పట్టణ ప్రగతి విజయవంతంగా నిర్వర్తించేలా చేపట్టాల్సిన పనులపై దిశేనిర్దేశం చేశారు. పల్లె ప్రగతి స్పూర్తితోనే పట్టణ ప్రగతిని కూడా విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్‌ నిర్ధేశించిన లక్ష్యాలను అందుకునేందుకు నిబద్దతతో పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టణ ప్రగతిలో పాల్గొంటారని కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మహాబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారు. అటు జీహెచ్ఎంసీ పరిధిలోనూ పట్టణ ప్రగతికి భారీ ఏర్పాట్లతో బల్దియా ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. నిరాక్షరాస్యతను రూపుమాపి, హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత గల నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ బొంతు రామ్మోహన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్చి 4 వరకు నిరక్షరాస్యుల సర్వే చేపడుతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story