పచ్చని పొలాన్ని దున్నేసిన అధికారులు.. పురుగుల మందు తాగిన రైతు
By - TV5 Telugu |25 Feb 2020 8:38 AM GMT
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పచ్చని పొలాన్ని దున్నేశారు అధికారులు. తహసీల్దార్ పొలం దున్నివేయించాడన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జరిగింది. బాధిత రైతు గుండు పోతురాజును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com