అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. హైదరాబాద్‌ హౌస్‌లో చర్చలు జరుపుతున్నారు. ఆర్థిక, వాణిజ్య, ఐటీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తున్నారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన కూడా చేశారు. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను భారత్‌కు అందిస్తామని ప్రకటించారు.

భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాల బలోపేతానికి అడ్వాన్స్‌డ్ వెపన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి MH-60 ఆర్.సి.హాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని తీర్మానించింది. మరికొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు. చర్చల అనంతరం.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story