విజయవాడలో అమరావతి మహిళా జేఏసీ ర్యాలీ

విజయవాడలో అమరావతి మహిళా జేఏసీ ర్యాలీ

విజయవాడలో అమరావతి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి మహిళలు, రైతులు భారీగా తరలివచ్చారు. చల్లపల్లి బంగ్లా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ SRR కాలేజీ వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. సీఎం జగన్‌ తీరుపై మండిపడుతున్నారు. పేదల భూ పంపిణీకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు.

అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు టీడీపీ, లెప్ట్‌నేతలు. వంగవీటి రాధా, దేవినేని ఉమ, బొండ ఉమతో పాటు లెఫ్ట్‌ పార్టీల నేతలు ఈ ర్యాలీ పాల్గొన్నారు. పేదల ఇళ్ల కోసమంటూ.. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మండిపడ్డారు. అమరావతి కోసం అందరూ ఒక్కటయ్యారన్నారు. ఇది కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని, 13 జిల్లాల ప్రజల సమస్య అన్నారు. గత 9 మాసాలుగా.. ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందంటూ మండిపడుతున్నారు.

Tags

Next Story