గ్రామాభివృద్ధి జరిగినప్పుడే.. దేశాభివృద్ధి జరుగుతుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గ్రామాభివృద్ధి జరిగినప్పుడే.. దేశాభివృద్ధి జరుగుతుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గ్రామాభివృద్ధి జరిగినప్పుడే.. దేశాభివృద్ధి జరుగుతుందన్న గాంధీ ఆశయాల మేరకే కేంద్రం పనిచేస్తోందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తాను దత్తత తీసుకున్న రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లిలో సతీసమేతంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయంలో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.. స్వయంసహాయక బృందాలకు బ్యాంకులు మంజూరు చేసిన 40 లక్షల చెక్కును పంపిణీ చేశారు.. అనంతరం గిరిజన తండాల్లో సహపంక్తి భోజనం చేశారు కిషన్‌ రెడ్డి దంపతులు.. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు బుక్స్‌ పంపిణీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story