కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసివేత

కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసివేత

ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకిస్తున్నవర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 7కు చేరింది. 50మంది గాయపడ్డారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హింసను చల్లార్చేందుకు దిల్లీ సరిహద్దుప్రాంతాలను కొంతకాలం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంఘవిద్రోహ శక్తులు బయటనుంచి వచ్చి హింసకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరామర్శించారు.

ఢిల్లీలోని భజల్ పూర్,ఛాంద్ బాగ్, కారావల్ నగర్, మౌజ్ పూర్, బాబర్ పూర్ ప్రాంతాల్లో ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. పోలీసులపై రాళ్లురువ్వుతూ.. దుకాణాలను దగ్దంచేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం.. ఈశాన్య ఢిల్లీప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 35 కంపెనీల ఫారామిలిటరీ బలగాలు, క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసులను మోహరించినట్లు తెలిపారు. నిరసనల పేరుతో పెద్దయెత్తున ఆస్తులను ధ్వంసం చేస్తుండటంతో ఆర్ధిక నేర పరిశోధన విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. హింసకు పాల్పడేవారిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగింది.

ఢిల్లీలో హింసను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాంతిని నెలకొల్పేందుకు తీసుకోవాల్సని చర్యలపై సీఎం కేజ్రీవాల్ అన్నిపార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే హింసకు పాల్పడుతున్నారని ఆయన నేతల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దులను కొంతకాలం మూసివేస్తున్నట్లు వారికి వివరించారు. శాంతికమిటీలను వేస్తున్నట్లు తెలిపారు.

సీఏఏ కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ సమయంలో పోలీసులు హింసను అదుపుచేయలేక పోయారని సిఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్లలేకపోయారన్నారు. నిరసన కారులపై లాఠీఛార్జీ చేయాలా, బాష్పవాయువులు ప్రయోగించాలో తేల్చుకోలేక పోయారని ఆయన వివరించారు. దీంతో నిరసనలు ఉద్రిక్తంగా మారినట్లు ఆయన కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.

Tags

Next Story