ఆంధ్రప్రదేశ్

నివురు గప్పిన నిప్పులా మారిన ఢిల్లీ

నివురు గప్పిన నిప్పులా మారిన ఢిల్లీ
X

ఢిల్లీ అల్లర్లలో మరణించి వారి సంఖ్య 20కి చేరింది. మరో 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మూడోరోజు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో పరిస్థితులను కంట్రోల్‌ చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను అమిత్ షా.. మూడోసారి భేటీకి పిలిచిన కొద్దిసేపటికే దోవల్ ఈశాన్య ఢిల్లీకి వచ్చి పరిస్థితిని రివ్యూ చేశారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ జరగనుంది. ఈ సమావేశంలో.. ఢిల్లీ పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్నారు అజిత్‌ ధోవల్.

మరోవైపు ఢిల్లీ నివురు గప్పిన నిప్పులు మారింది. ఈ ఉదయం ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో.... అదనపు భద్రతా బలగాలు రంగంలో దిగాయి. జఫాబాద్, మౌజ్‌పూర్, బబూర్‌పూర్, కరవాల్ నగర్, చాంద్ బాగ్, గోకుల్‌పురి వంటి ప్రాంతాల్లో హింస చెలరేగింది. దీంతో ఈ ప్రాంతాల్లో కవాతు నిర్వహించాయి భద్రతాదళాలు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. హింసను నియంత్రించేందుకు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు హింసాయుత ఘటనల నేపథ్యంలో రేపు నార్త్ ఢిల్లీ పరిధిలోని 86 సెంటర్స్‌లో జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ బోర్డు వాయిదా వేసింది. 10,11,12 తరగతుల పరీక్షలు వాయిదా పడ్డాయి.మరోవైపు ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు సీరియస్‌ అయింది. గాయపడినవారిని....తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.

Next Story

RELATED STORIES