పేదలకు, రైతులకు మధ్య వైసీపీ చిచ్చు పెడుతోంది: దేవినేని ఉమా

పేదలకు, రైతులకు మధ్య వైసీపీ చిచ్చు పెడుతోంది: దేవినేని ఉమా

పేదలకు, రైతులకు మధ్య చిచ్చుపెట్టేందుకే వైసీపీ ప్రభుత్వం భూపంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. మందడంలో రైతుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ ఎన్ని కుట్రలు చేసినా.. చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని అమరావతి ఎక్కడికీ వెళ్లదని భరోసా ఇచ్చారు. కోర్టు తీర్పు రైతులకే అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేవినేని ఉమ.

Tags

Next Story