హీరో మహేష్‌ బాబుకు జగనన్న విద్యాదీవెన కార్డు!

హీరో మహేష్‌ బాబుకు జగనన్న విద్యాదీవెన కార్డు!

ఏపీలో ప్రభుత్వధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కర్నూలు జిల్లా జగనన్న విద్యాదీవెన కార్డులు తప్పుల తడకగా ఫ్రింటయ్యాయి. ఈ కార్డుల్లో ఏకంగా సినీహీరో మహేష్‌బాబు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఎమ్మిగనూరు సిద్దార్ధ కళాశాలలో బీకాం చదువుతున్న పేరంపోగు లక్ష్మీకి చెందిన జగనన్న విద్యాదీవెన కార్డులో ఆమె ఫోటోకు బదులుగా.. హీరో మహేష్‌ బాబు ఫోటో ముద్రించారు. అలాగే.. పత్తికొండ నియోజకవర్గం వైష్ణవి డిగ్రీ కాలేజీకి చెందిన బీకాం ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న లోకేష్‌గౌడ్‌ కార్డులోనూ మహేష్‌బాబు ఫోటో ఉండటంతో విస్తుపోతున్నారు.

లోకేశ్‌గౌడ్‌కు ఇప్పటికే కార్డు అందగా.. లక్ష్మికి ఇంకా అందాల్సి ఉంది. ఆమె కార్డు ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్దే ఉండగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం చూసిన లక్ష్మి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. జరిగిన పొరపాటును అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే తప్పు జరిగిందని, తమకెలాంటి సంబంధం లేదంటున్నారు. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాదీవెన కార్డుల్లో తప్పులు దొర్లటంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Next Story