ఎవరి వార్డుకు వారే కేసీఆర్: కేటీఆర్

ఎవరి వార్డుకు వారే కేసీఆర్: కేటీఆర్

మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందాం అనే నినాదంతో ప్రజలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్‌. ఎవరి వార్డుకు వాళ్లే కేసీఆర్‌ అని.. ప్రతిఒక్కరూ బాధ్యతతో నడుచుకుంటూ పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పట్టణ ప్రగతి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. చెత్తను కాల్వడం చాలా హానికరమని, ఇకపై ఇలాంటివి నడవదని హెచ్చరించారు. ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉండకపోతే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వార్డు పారిశుధ్య ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. 85 శాతం మొక్కలు బతకకుంటే కౌన్సిలర్‌ పదవి పోతుందని హెచ్చరించారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story