అర్థరాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన టీచర్‌

అర్థరాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన టీచర్‌

కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని జ్యోతి విద్యానికేతన్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తెలుగు పాఠాలు బోధించే హుస్సేన్‌ మియా ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. నిత్యం వాట్సాప్‌లో చాటింగ్‌ చేసేవాడు. అర్థరాత్రి ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన విద్యార్థిని బంధువులు కీచక ఉపాధ్యాయుడు హుస్సేన్‌ మియాకు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

Tags

Next Story