వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు

వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు

వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఒటమికి శివ కారణమంటూ ఆ యువకుడిపై మాజీ కౌన్సిలర్ వెంకటేష్‌ కత్తితో దాడికి చేశాడు. శివ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొల వెంకటేష్‌, ఇండిపెండంట్‌ అభ్యర్థిగా దివ్య పోటీ చేశారు. అయితే శివ తనకు కాకుండా దివ్యకు మద్దతు తెలిపాడన్న కక్షతో శివపై కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు .కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story