టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఎన్నారైలు మృతి

X
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మరణించారు. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్నారైలు దివ్య ఆవుల, రాజాగవిని, ప్రేమ్ నాధ్ రామనాధం అనే ముగ్గురు మృత్యువాతపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణం ఎఫ్ ఎం 423 పై డెల్ వెబ్ బౌలేవార్డు జంక్షన్ వద్ద ఈప్రమాదం జరిగింది. ప్రవాస భారతీయులు ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్, గాంధీనగర్ నగర్ వాసులు. మరణ వార్త తెలియగానే వారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారును డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
