ఎన్ కౌంటర్ చేసినా వెనక్కి వెళ్ళేది లేదు : చంద్రబాబు

ఎన్ కౌంటర్ చేసినా వెనక్కి వెళ్ళేది లేదు : చంద్రబాబు

ఎట్టి పరిస్థితుల్లోను విశాఖలో పర్యటించి తీరుతానని ప్రతిపక్షనేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ చేసినా వెనక్కి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ గూండాలు తనను అడ్డుకుంటే పోలీసులు ఏమి చేయలేమని చేతులెత్తాస్తారా? అనుమతి ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేయించారని.. వైసీపీ దుర్మార్గంగా యాత్రను అడ్డుకుంటుంటే పోలీసులు దానికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా అని పోలీసులను ప్రశ్నించారు చంద్రబాబు.

Tags

Next Story