ఆంధ్రప్రదేశ్

విశాఖలో బట్టబయలైన వైసీపీ కుట్రలు

విశాఖలో బట్టబయలైన వైసీపీ కుట్రలు
X

వైసీపీ పెయిడ్‌ బ్యాచ్‌ బండారం బట్టబయలైంది. విశాఖలో చంద్రబాబు అడ్డుకున్న వ్యవహారంలో వైసీపీ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్కో మనిషికి 5 వందల రూపాయల ఇచ్చిన వైసీపీ నేతలు.. పచ్చ చీరల్లో వచ్చి గుడ్లు, చెప్పులు విసరాలని పురామాయించినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక వైసీపీ ముఖ్య నేతాగణం పక్కాగా డైరెక్షన్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏకంగా ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రులే విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టారంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు

మనిషికి 5 వందల రూపాయలు ఇచ్చి ఆటోల్లో పెయిడ్‌ ఆర్టిస్టులను వైసీపీ నేతలు తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ మహిళా కార్యకర్తలకే పసుపు చీరలు కట్టించి.. టీడీపీ కార్యకర్తల ముసుగులో చెలరేగాలని చేసిన ప్రయత్నం వాళ్లు తీసిన వీడియోల ద్వారానే బెడిసికొట్టిందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.

గంటల పాటు గోబ్యాక్ అంటూ మొత్తుకున్న పెయిడ్‌ ఆర్టిస్టులు.. అలసట రావడంతో చెట్ల కింద సేదతీరారు. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబును అడ్డుకుంటే కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని కొంత మంది పెయిడ్‌ ఆర్టిస్టులు గొణుక్కున్నారు. ఇదేం ఖర్మరా బాబు అంటూ వైసీపీ నేతలను, సీఎం జగన్‌ను శపిస్తున్నారు. ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఆటోలు దొరకవంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్‌ కొందరు అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లిపోయారు. మరికొందరు చంద్రబాబు కాన్వాయ్‌ ముందు అలసట వచ్చే దాకా కేకలు పెడుతున్నారు.

ఎప్పుడు ప్రశాంతంగా.. పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న విశాఖబ్రాండ్‌ను, సాగర తీరం పరువును ఒక్క దెబ్బతో గంగలో కలిపేసింది వైసీపీ. విశాఖ బ్రాండ్‌ను ఏకంగా ప్రభుత్వమే దెబ్బతీయడంతో విశాఖ వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పెయిడ్‌ ఆర్టిస్టులతో అన్ని రోడ్లను బ్లాక్‌ చేయించడంతో విశాఖ వాసులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES