టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ ముందు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల తోపులాట, ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన వైసీపీ శ్రేణులు.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా తరలివచ్చారు. దీంతో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు.. వారిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. చంద్రబాబు అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఎయిర్‌పోర్ట్ పరిసరాలు మారుమోగాయి. మహిళలని చూడకుండా టీడీపీ కార్యకర్తలను తోసేశారు. ఇరు వర్గాల ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com