ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ ఆకస్మికంగా బదిలీ.. పలు అనుమానాలు..

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ ఆకస్మికంగా బదిలీ.. పలు అనుమానాలు..

బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలే.. ఢిల్లీ అల్లర్లకు దారితీశాయని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. బదిలీని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. జస్టిస్ మురళీధర్‌ బదిలీపై పునరాలోచన చేయాలని కోరారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్‌ బదిలీ.. రొటీన్‌గా జరిగే ప్రక్రియలో భాగమని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే.. బదిలీ చేసిన టైమింగ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్‌ మురళీధర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేయాలని 2018 డిసెంబర్, 2019 జనవరిలో కేంద్రం చేసిన సిఫార్సును.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అయితే.. ఆయన్ను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 12న రికమెండ్‌ చేసినట్టు చెప్తున్నారు. అల్లర్ల కేసుల విచారణకు, ఈ బదిలీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అల్లర్లు జరగడానికి చాలారోజుల ముందే.. కొలీజియం రికమెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ అర్వింద్ బోబ్డేను సంప్రదించాకే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు, ఈ ట్రాన్స్‌ఫర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు.

ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిష్లనను అక్కడి హైకోర్టు విచారణ చేస్తోంది. కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్‌ వర్మలు.. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసారంటూ.. వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదంటా దాఖలైన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ విచారణ చేస్తోంది. అందులో జస్టిస్ మురళీధర్ కీలక సభ్యుడుగా ఉన్నారు. బుధవారం విచారణలోనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణను గురువారం వాయిదా వేశారు. ఈనేపథ్యంలో.. పంజాబ్, హర్యానా హైకోర్టుకు జస్టిస్‌ మురళీధర్ బదిలీ సంచలనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story