సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయింది : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయింది : మంత్రి  కేటీఆర్

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..అధికారులకు సూచనలు ఇస్తున్నారు..జనగామ పట్టణంలో ఆకస్మిక పర్యటన చేసిన కేటీఆర్.. పట్టణ ప్రగతి జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లో తిరుగుతూ, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, పచ్చదనం పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయిందన్నారు కేటీఆర్. ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకువచ్చామని తెలిపారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం - పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

మోపాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.

జనగామ పర్యటన తర్వాత భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్. రానున్న 4 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున పార్టీల కతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.. పట్టణంలోని పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.. పట్టణంలో పెద్దఎత్తున పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలన్నారు. కౌన్సిలర్లు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహిస్తే..గణనీయమైన మార్పు వస్తుందన్నారు.. మళ్లీ రెండు నెలల్లో భువనగిరి పట్టణానికి వస్తానని అప్పుడు మార్పు కనిపించాలని స్పష్టం చేశారు...

పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని అన్నారు కేటీఆర్‌ . బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ మాత్రమే అని కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story