రోడ్డుపై కనిపించిన పెద్దపులి.. వణికిపోయిన వాహనదారులు

రోడ్డుపై కనిపించిన పెద్దపులి.. వణికిపోయిన వాహనదారులు

పెద్దపులి గాండ్రింపు వింటేనే హడలిపోతాం. అలాంటిది అకస్మాత్తుగా కళ్ల ముందు కనిపిస్తే! ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులకు అదే పరిస్థిది ఎదురైంది. జిల్లాలోని జైనత్ సమీపంలోని నిరాల గ్రామం దగ్గర మేయిన్ రోడ్డుపై వాహనదారులకు పులి అడ్డం వచ్చింది. రోడ్డు దాటుతున్న పెద్దపులిని చూసి కారులో ఉన్నవారు వణికిపోయారు.

అయితే..గత కొన్ని వారాలుగా జిల్లాలోని తాంసి, భీంపూర్‌ మండలాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. భీంపూర్ మండలంలో ఇందూరు పల్లి, ఘోల్లఘట్, తాంసి-కె గ్రామాలు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోనూ పులి ఆనవాళ్లు కనిపించాయి. రెండు వారాల్లోనే నాలుగైదు పశువుల్ని పులి పొట్టనబెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల జనం ఊరుదాటి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయారు. చివరికి గిరిజన పల్లెల్లో విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు భయపడిపోయారు.

తాంసి, భీంపూర్ ఘటనల నుంచి కాస్త ఊపిరి పీల్చుకుంటుండగానే లేటెస్ట్ గా జైనత్ మండలంలో పెద్ద పులి సంచారం ప్రజలను మరింత హడలెత్తిస్తోంది. రాత్రి వేళ రోడ్డు మీద కనిపించిగా కొద్ది గంటల వ్యవధిలోనే మండలంలోని సాత్నాల గ్రామ సమీపంలో రెండు పశువులపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారం విషయం తెల్సుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారాణ్యం నుంచి జిల్లాలోకి పులి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story