చికెన్‌కు.. కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు : ఎగ్ కోఆర్డినేష‌న్ క‌మిటీ

చికెన్‌కు.. కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు : ఎగ్ కోఆర్డినేష‌న్ క‌మిటీ

చికెన్‌కు.. కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎగ్ కోఆర్డినేష‌న్ క‌మిటీ స్పష్టం చేసింది. క‌రోనా భ‌యంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారిగా ప‌డిపోయాయని.. సోష‌ల్ మిడియాలో వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎగ్ కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌భ్యుడు ఆనంద్ అన్నారు. ప్రజ‌ల్లో భ‌యాల‌ను తొల‌గించేందుకు ఇవాళ సాయత్రం పీపుల్స్ ప్లాజాలో చికెన్, ఎగ్ మేళాల‌ను నిర్వహిస్తున్నామ‌ని మ‌రో స‌భ్యుడు రాంరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో 6వేల కిలోల చికెన్ వంట‌కాల‌ను ప్రజ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని ప్రజ‌లు ఈ కార్యక్రమాన్ని విజ‌య వంతం చేయాల‌ని కోరారు. ఇప్పటికే పౌల్ట్రీ ప‌రిశ్రమ తీవ్ర స్థాయిలో న‌ష్టపోతోంద‌ని.. మ‌రింత కాలం ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ప‌రిశ్రమ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంద‌ని.. వ‌దంతులు ప్రజ‌లు న‌మ్మకుండా చికెన్‌ను ఎప్పటిలాగే తినాలిని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story