24 గంటల్లో డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి

24 గంటల్లో డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
X

తమిళనాడులో డీఎంకే పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. 24 గంటల్లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. వారిలో గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కథావరయణ్‌ మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

ఇదిలావుంటే గురువారమే డీఎంకే పార్టీకి చెందిన తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేపీపీ స్వామి (58) కన్నుమూశారు. 1962 జూలై 1వ తేదీన జన్మించిన స్వామి చెన్నై కేవీ కుప్పంలో నివసిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు పార్టీ నేతలు నివాళులు అర్పించారు. కాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి చెందడంతో డీఎంకే పార్టీ షాక్ లో మునిగిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేల మృతిపై డీఎంకే అధినేత స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Next Story