అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : లోకేష్‌

అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : లోకేష్‌

విశాఖలో ప్రతిపక్షనేతపై ఉద్దేశపూర్వకంగానే వైసీపీ దాడికి పాల్పడిందని ఆరోపించారు నారా లోకేష్‌. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని.. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించిన లోకేష్‌.. ప్రతి అధికారి పేరు నోటు చేసుకుంటున్నామని తెలిపారు. విశాఖ దాడి వ్యవహారంలో డీజీపీ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విశాఖ ఘటనపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు లోకేష్‌.

Tags

Next Story