యువతిని కిడ్నాప్‌ చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

యువతిని కిడ్నాప్‌ చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ఇంట్లో పెట్రోల్ చల్లి, గ్యాస్‌ లీక్‌ చేసి.. కొవ్వొత్తి వెలిగించి పుర్రె, ఎముకలు ఉంచి ఓ యువతిని కిడ్నాప్‌ చేశాడు ఓ ప్రబుద్దుడు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రబుద్దుడి ప్రయత్నాన్ని కడప పోలీసులు భగ్నం చేశారు. కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసి , యువతిని సురక్షితంగా తల్లిదండ్రుకు అప్పగించారు.

విద్యాబుద్దులు నేర్పాలల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డేరంగుల కృష్ణ మోహన్.. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరిట తరచూ వేదింపులకు గురి చేసేవాడు. పెళ్లి చేసుకోవాలని వెంటపడేవాడు. బీటెక్‌ పూర్తి చేసిన బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆ యువతి .. ఇటీవల కడప నగరంలోని తన ఇంటికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిడ్నాప్‌ చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. బుర్ఖాతో యువతిని కిడ్నాప్‌ చేసి వేలూరుకు తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వేలూరు రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు.

Tags

Next Story