విషాదం.. గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

విషాదం.. గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

హైదరాబాద్ హబీబ్‌ నగర్‌ విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారు. హబీబ్‌ నగర్‌ పరిధిలోని అఫ్జల్‌ సాగర్‌ రోడ్డు మాన్‌ గరి బస్తీలో చిన్నారులపై గోడ కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆరేళ్ల రోషిణి, మూడేళ్ల సారికతో పాటు నాలుగు నెలల చిన్నారి చనిపోయారు.

గోడ కూలిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు ప్రమాదంలో చిన్నారులను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story