ఎవరిపై కక్షతో రాజధాని మారుస్తున్నారో వైసీపీ నేతలు చెప్పాలి : రైతులు
నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిన జగన్ తీరుతో తమకు కంటినిండా నిద్ర కూడా కరువైందంటున్నారు రాజధాని రైతులు. ఎవరిపై కక్షతో రాజధాని మారుస్తున్నారో YCP నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిపై వేసిన కమిటీలన్నీ కుట్రలేనని.. కోర్టుల సాయంతో వీటిని అడ్డుకుంటామని చెప్తున్నారు. 29 గ్రామాలతోపాటు 13 జిల్లాల్లో అమరావతికి అనుకూలంగా ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి 74 రోజులుగా మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారని.. ఈ స్ఫూర్తిని చూసైనా జగన్ 3 రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమతో చర్చలకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని అంటున్నారు. రాజధాని నిర్మాణంలో తమను కూడా భాగస్వాములను చేస్తూనే భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తమకు అన్యాయం చేయడం ఏంటని నిలదీస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com