చికెన్‌తో కరోనా రాదు : తెలంగాణ మంత్రులు

చికెన్‌తో కరోనా రాదు : తెలంగాణ మంత్రులు

తెలంగాణ మంత్రులు రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ ఫెస్టివల్ లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. కరోనా వైరస్ వదంతులతో చికెన్ మాంసంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు ఫౌల్ట్రి ఫెడరేషన్ చెకెన్ అండ్ ఎగ్ మేళ కార్యక్రమాన్నిచేపట్టింది. అతితక్కువ ఖర్చుతో పౌష్టికాహారం లభించే చికెన్ ప్రైతో కరోనా ప్రభావం లేదని.. నిర్భయంగా చికెన్‌ను తినవచ్చని మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్‌ అన్నారు.

కోళ్ళకు కరోనా వైరస్ వ్యాపించిందంటూ వదంతులు రావడంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయన్నారు. చికెన్‌లో మంచి పోషక పదార్థాలు ఉన్నాయని.. చికెన్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని మంత్రులు అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అదే స్థాయిలో అరుదైన రోగాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. 'రేర్ డిసీజ్ డే' సందర్భంగా.. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అరుదైన వ్యాధులకు గురయ్యేవారిలో 90 శాతం పేదలే ఉంటున్నారని అన్నారు.

అంతకుముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కును సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతులను పరిశీలించారు. వాటర్‌ హార్వెస్టింగ్‌పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు కేటీఆర్.

జలమండలి సిబ్బంది కోసం రూపొందించిన యునిఫామ్స్‌తో పాటు..నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన రిజిష్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు కేటీఆర్.

Tags

Next Story