నిర్భయ కేసు : సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్

నిర్భయ కేసు : సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్

ఢిల్లీలో సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో మరో ముగ్గురితో పాటు నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ గుప్తాను సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చమని విజ్ఞప్తి చేసుకున్నాడు. పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నందున దోషుల ఉరిశిక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో నాలుగు రోజుల ముందు పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం చర్చనీయాంశం అయింది.

Tags

Read MoreRead Less
Next Story