ఆంధ్రప్రదేశ్

మంచినీళ్లు ఇస్తానని విద్యార్థినులతో మాయమాటలు చెప్పిన పోకిరి..

మంచినీళ్లు ఇస్తానని విద్యార్థినులతో మాయమాటలు చెప్పిన పోకిరి..
X

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ పోకిరీపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. బీ.ఆర్‌.ఎం.వి స్కూలల్లో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మంచునీళ్లు తాగేందుకు బయటకు వెళ్లారు. స్కూల్‌కి దగ్గరగా ఉన్న ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు.. ఆ ఇంట్లో ఉన్న నిమ్మల శివ కృష్ణ.. ఆ బాలికలకు ఇంట్లోకి వస్తే మంచినీళ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. నీళ్ల కోసం ఇంట్లోకి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు.. జరిగిన విషయాన్ని ఆ ఇద్దరు విద్యార్థిణులు తోటి విద్యార్థులకు చెప్పడంతో.. వారు స్పందించి స్కూల్‌ సిబ్బందికి విషయం చెప్పారు. స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దిశ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES