మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. మార్చి 5వ తేదిన GSLV-F-10 వాహకనౌకను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా G.I.శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది భారతదేశ తొలి భూపరిశీలన ఉప గ్రహం. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. మార్చి 5 సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ శాటిలైట్‌ ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థతో కక్ష్యను చేరుకుంటుంది. రెండుగా విడిపోయే 4 మీటర్ల వ్యాసంతో తయారైన పేలోడ్లను తొలిసారి జీఎస్‌ఎల్‌వీ ద్వారా ద్వారా ప్రయోగించనున్నా రు. 2020-21 నాటికి మరో 10 భూపరిశీలన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. వీటిల్లో రెండు నేవిగేషన్, మూడు సమాచార ఉపగ్రహాలు ఉంటాయి.

ఇదిలా ఉంటే, ఇస్రో ప్రయోగాలకు కొత్త వేదికలు సిద్ధమయ్యాయి. తాజాగా హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ 50వ L-40 వేదికను ఇస్రోకు అందచేసింది. ఆగస్టులో ఇస్రో ప్రయోగించే GSLV-MK-2కు అనుగుణంగా ఈ వేదికను తయారు చేశారు. GSLV-MK-2 శ్రేణి వ్యోమనౌకలకు ఉపయోగపడేవిధంగా ఇస్రో కొత్త వేదికలను తయారు చేయిస్తోంది. అందులో భాగంగా హాల్ ఆధ్వర్యంలో L-40 స్టేజ్‌లు తయారవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story