బాలుడి మృతి తట్టుకోలేక.. బాబాయ్‌ ఆత్మహత్య

బాలుడి మృతి తట్టుకోలేక.. బాబాయ్‌ ఆత్మహత్య

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి మృతి తట్టుకోలేక.. అతడి బాబాయ్‌ చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి నియోజకవర్గం చిప్పాడ మండలానికి చెందిన బాలుడు భాను ప్రకాశ్‌కు చిరంజీవి బాబాయ్‌ అవుతాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా భాను ప్రకాశ్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాడు.. అనారోగ్యం తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతిని జీర్ణించుకోలేకపోయిన బాబాయ్‌ చిరంజీవి మనస్తాపంతో ఐదంతస్తుల హాస్పిటల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు..

Tags

Next Story