శ్రీకాకుళం జిల్లాలో స్టూడెంట్స్ గ్యాంగ్‌వార్
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇంటర్ విద్యార్ధులు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ స్టూడెంట్స్ మధ్య తలెత్తిన వివాదం చివరికి స్ట్రీట్ ఫైట్ వరకు వెళ్లింది. దీంతో పాలకొండ మెయిన్ రోడ్డు ఒక్క సారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పిడిగుద్దులు, తిట్లతో స్టూడెంట్స్ ఇష్టానుసారంగా కొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఘర్షణ జరుగుతున్నా..దాదాపు గంట పాటు వారిని అడ్డుకునే వారేలేరు.
శనివారం ఉదయం తమ్మినాయుడు కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ను సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సీనియర్.. జూనియర్ ఇంటర్ విద్యార్ధిని చావబాదాడు. విషయం తెలుసుకున్న బాధితుడి ఫ్రెండ్స్ సీనియర్ పై అటాక్ చేశారు. దీంతో ఇష్యూ సీనియర్స్, జూనియర్స్ గొడవగా మారిపోయింది. నడిరోడ్డుపై చిల్లర గ్యాంగ్ తరహాలో తన్నుకున్నారు. దీంతో గంట పాటు ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీస్ స్టేషన్ ముందే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా..అటువైపు ఒక్క పోలీస్ కూడా రాలేదు. చివరికి స్థానికులే విద్యార్ధులను తరిమేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com