చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న వ్యవహారంలో 54మందిపై కేసులు

చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న వ్యవహారంలో 54మందిపై కేసులు

ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న కేసులో 54 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు.. వాహనాలపై చెప్పులు, టమాటలు, గుడ్లు విసిరినందుకు 32 మంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టారు. అలాగే మరో 20 మంది టీడీపీ నాయకులతో పాటు.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రజా సంఘాల నాయకుడు జేటీ రామారావు, వైసీపీ నాయకురాలు కృపాజ్యోతిపై సెక్షన్‌ 46,47,48 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. రామారావు, కృపాజ్యోతిని విశాలాక్షి నగర్‌లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదైన వారిలో వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story