మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు సింగ్రౌలీ ప్రాంతంలో ఎదరురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో ఓ లోకోపైలట్ సహా మరో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఎన్టీపీసీ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. రెండు ట్రైన్ల మధ్య చిక్కుకున్న ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

Tags

Next Story