కేజ్రీవాల్ ప్రభుత్వంపై పెదవి విరిచిన కాాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేజ్రీవాల్ ప్రభుత్వంపై పెదవి విరిచిన కాాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

జేఎన్‌‌యూ విద్యార్థి నాయుకుడు కన్హయ్య కుమార్ పై గతంలో నమోదైన దేశద్రోహం కేసును విచారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం.. నగర పోలీసులకు అనుమతి మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తప్పుపట్టారు. దేశద్రోహం కేసుపై కేంద్రప్రభుత్వం కంటే ఢిల్లీ ప్రభుత్వానికి తక్కువ అవగాహన ఉందని మండిపడ్డారు. 120బీ, 124ఏ సెక్షన్ల కింద నమోదైన కేసులకు దేశద్రోహం విచారణ జరిపేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ట్వీటర్ ద్వారా తెలిపారు. పార్లమెంట్ పై దాడి చేసిన అప్జల్ గురును ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తు.. దేశద్రోహ నినాదాలు చేశారని కన్హయ్య కుమార్ తో పాటు మరికొందరి మీద 2016 ఫిబ్రవరిలో చార్జిసీట్ ఫైల్ చేశారు. నాలుగేళ్ల తరువాత ఈ కేసును పున: ప్రారంభించడంపై చిదంబరం మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story