శ్రీశైలం క్షేత్ర పరిధిలో వైసీపీ నేతల హల్‌చల్

శ్రీశైలం క్షేత్ర పరిధిలో వైసీపీ నేతల హల్‌చల్

కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్ర పరిధిలో వైసీపీ నేతల హల్‌చల్ చేశారు. దేవస్థానం నిబంధనలు పట్టించుకోకుండా.. వైసీపీ ఫ్లెక్సీలతో కూడిన వాహనాలతో ఆలయ వీధుల్లోకి వచ్చారు. అయినా అధికారులు చూసిచూడనట్లే వ్యవహరించారు. నిబంధనల ప్రకారం దేవస్థానం పరిసరాల్లోకి పార్టీ జెండాలతో రావడం నిషేధం.

మూడు రాజధానులకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన నందిగామ ఎమ్యెల్యే జగన్ మోహన్ రావు...వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలతో కూడిన వాహనాల్లో ఆలయ వీధుల్లోకి వచ్చారు..దేవుడి దగ్గర రాజకీయాలేంటి అంటూ..వైసీపీ నేతల తీరుపై భక్తులు మండిపడ్డారు.

Tags

Next Story