కొంపల్లి మున్సిపాలిటీ సుందరంగా తయారుకావాలి: మంత్రి మల్లారెడ్డి

కొంపల్లి మున్సిపాలిటీ సుందరంగా తయారుకావాలి: మంత్రి మల్లారెడ్డి

స్వచ్చ, పరిశుభ్ర తెలంగాణ లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. పలు అభివృద్ది పనులకు స్థానిక ఎమ్మెల్యే వివేకానందతో కలిసి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి స్పూర్తితో పట్టణ ప్రగతికార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పచ్చదనం-పరిశుభ్రత తో కొంపల్లి మున్సిపాలిటీ సుందరంగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు,ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు, కమీషనర్ జ్యోతిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story