తెలంగాణలో జోరుగా సాగుతోన్న పట్టణ ప్రగతి

తెలంగాణలో జోరుగా సాగుతోన్న పట్టణ ప్రగతి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి... జోరుగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 10 రోజులు పాటు నిర్వహిస్తోంది తెలంగాణప్రభుత్వం. అంటే ఈ నెల... 4 వరకు పది రోజలు పాటు పట్టణ ప్రగతి జరగుతోంది..

పల్లెలన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతూ... అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో... తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతోంది. మండలస్థాయి ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు పల్లె నిద్రలు చేస్తూ... గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగానే.. మహబూబ్‌నగర్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ వెంకట్రావ్‌... పల్లెప్రగతితోపాటు... పట్టణ ప్రగతిని కూడా.. పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి కేటీఆర్‌... ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఇవాళ పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కూరగాయల మార్కెట్‌, ఓపెన్‌ జిమ్‌, మినీ ట్యాంక్‌ బండ్‌లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌.

పట్టణప్రగతిలో ముఖ్యంగా విద్యుత్‌, పారిశుద్ధ్య, పచ్చదననం వంటి మూడు అంశాలపై ప్రధానంగా ... ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. కౌన్సిల్‌ సభ్యులు వార్డుల్లో పర్యటించి... రోజుకో సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story