తాలిబన్లు, అమెరికా మధ్య శాంతి ఒప్పందం

ఆఫ్ఘనిస్థాన్‌లో సరికొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. అమెరికా, తాలిబన్లు దాడులు, ప్రతిదాడులకు ముగింపు పలకనున్నాయి. అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం జరగనుంది. ఖతార్‌లోని దోహాలో ఇరు వర్గాలు డీల్‌పై సంతకం చేయనున్నాయి. ఈ స్పెషల్ ఈవెంట్‌కు భారతదేశం హాజరు కానుంది. భారత్‌తో పాటు దాదాపు 30 దేశాల ప్రతినిధులు ఈ శాంతి ఒప్పందం కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ పీస్ డీల్‌కు దూరంగా ఉంటోంది.
తాలిబన్లకు, అమెరికా బలగాలకు మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోంది. ఇరు వర్గాలు పరస్పరం పైచేయి సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఈ చర్యల కారణంగా వందలమంది అమాయక ప్రజలు బలయ్యారు. ఆప్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్, గత ఏడాది సంచలన ప్రకటన చేశారు. ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఆప్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనకు తాలిబన్లతో చేతులు కలుపుతామని ప్రకటించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. పీస్ డీల్‌తో హింసా త్మక వాతావరణానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐతే, తాలిబన్లతో అమెరికా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో ఇంకా స్పష్టత రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com