నిర్భయ కేసు : ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్

ఢిల్లీలో సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితుల మానసిక, శారీరక పరిస్థితిని నిర్ధారించడానికి శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త డెత్ వారెంట్ ప్రకారం, రెండు రోజుల తరువాత, మార్చి 3 న, ఉదయం ఆరు గంటలకు, నలుగురు దోషులను ఉదయం 6 గంటలకు చనిపోయేవరకు ఉరి తీయాలని ఫిబ్రవరి 17 న, ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దోషులలో ఒకరైన అక్షయ్ ఠాకూర్ ఫిబ్రవరి 29 న రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టమని వేడుకున్నారు.
ఇంతకు ముందు ముఖేష్, వినయ్ మరియు అక్షయ్ అనే ముగ్గురు దోషుల క్షమాబిక్ష పిటిషన్లను అప్పటికే రాష్ట్రపతి కొట్టివేసారు. అలాగే, క్షమాబిక్ష పిటిషన్లను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ మరియు వినయ్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్లను కోర్టు గతంలో కొట్టివేసింది. మరోవైపు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ మరో దోషి పవన్ కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com