తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6 నుంచి రెండు వారాల పాటు సమావేశాలు జరుగనున్నాయి. తొలి రోజు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.
ఇక, ఆదివారం, సోమవారం సభకు సెలవు. సోమవారం హోళి పండుగ కావడంతో సభ తిరిగి మంగళవారం ప్రారంభమతుంది. అదే రోజు ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను మండలిలో ప్రవేశపెడతారు.
మొదటిరోజు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు ఆదివారం, సోమవారం (హోళి) సెలవు దినాలు కావడంతో సభ తిరిగి మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముగించి గురువారం కావడంతో సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి ఒక రోజు సభకు విరామం ఇస్తారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సభకు సెలవు దినాలు కావడంతో తిరిగి సోమవారం నుంచి బడ్జెట్ పద్దులపై చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడుతాయి. శాసనసభ ప్రారంభం, బడ్జెట్ ప్రవేశ పెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం, సభ నిర్వహించే పని దినాలపై (12 లేక 16) ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com