వైరస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు - కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

వైరస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు - కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వెలుగు చూసింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు కొవిడ్‌ 19 లక్షణాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తితో పాటు, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు ఐదుకు చేరినట్లు తెలిపారాయన. ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. నేపాల్‌ సరిహద్దుల్లోనూ టెస్ట్‌లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు కేంద్రమంత్రి హర్షవర్దన్‌.

Tags

Next Story