చైనాలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఇంకా దేశమంతా భయం గుప్పిట్లోనే ఉంది. రోజువారీ మరణాలు 45 మాత్రమే నమోదవడంతో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికీ 5 ఖండాల్లో 60 దేశాల్ని భయపెడుతున్న కరోనా.. ఆర్థికంగానూ ఆయా దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే చైనా సహా అన్ని చోట్లా కలిపి ఇప్పటికి మృతుల సంఖ్య 3 వేలు దాటేసింది.
ఇరాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా మరికొన్ని దేశాలు వైరస్ ధాటికి విలవిలలాడుతున్నాయి. ఇరాన్‌లో వందల సంఖ్యలో మరణించారని అంటున్నా అధికారికంగా ఆ లెక్క 50లోపే ఉందని చెప్తున్నారు. ఇటలీలో 29 మంది కరోనాకు బలైతే.. వాషింగ్టన్‌లో కొవిడ్-19 కారణంగా ఓ మహిళ మృతి చెందింది. ఇటలీలో 85 మంది భారతీయ విద్యార్థుల్ని కూడా ప్రత్యేకంగా ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో 19 కరోనా కేసులు ఉన్నాయి. దక్షిణ కొరియాలో 3, 500కిపైగా వైరస్ టెస్ట్‌లు చేశారు. ముఖ్యంగా ఈ వైరస్ వృద్ధులపైనే ప్రభావం చూపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com